* నేడు పురుషుల హాకీ వరల్డ్‌కప్ సెమీస్.. తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనున్న జర్మనీ.. మరో సెమీస్‌లో బెల్జియం, నెదర్లాండ్స్ ఢీ
* నేడు భారత్‌తో కివీస్ తొలి టీ20 మ్యాచ్.. రాంచీ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* ఢిల్లీ: శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ.. ఉదయం 10 గంటలకు విచారణ జరపనున్న సీబీఐ స్పెషల్ కోర్టు.. తన నానమ్మ అంత్యక్రియల కోసం శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్
* నేడు దేశవ్యాప్తంగా పరీక్షా పే చర్చ కార్యక్రమం.. విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లడనున్న ప్రధాని నరేంద్ర మోడీ
* నేటి నుంచి తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీలు, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు.. మాన్యువల్‌గా పదోన్నతులు.. నేడు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్న సీనియారిటీ జాబితా.. రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
* విశాఖ: నేడు గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికుల మహాపాదయాత్ర.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న ప్రజాగర్జన సభ.. ఇప్పటికే అన్ని పార్టీల మద్దతు కోరిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ
* రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ఎస్ఎస్‌డీ టోకెన్లు, వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు రద్దు.. నేడు, రేపు అడ్వాన్స్ వసతిగదుల కేటాయింపు రద్దు చేసిన టీటీడీ
* తిరుమల: ఇవాళ టిటిడి మొబైల్ యాప్ ని విడుదల చేయనున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. మొబైల్ యాప్ ద్వారా టిటిడికి సంబంధించిన సమగ్ర సమాచారం భక్తులకు అందుబాటులోకి తేనున్న టీటీడీ
* నంద్యాల : కొలంభారతి అమ్మవారికి ప్రత్యేక పూజలు పిల్లలకు అక్షరభాషం కుంకుమార్చనలు అభిషేకము చేయనున్న అర్చకులు
* గుంటూరు: నేటి నుంచి రెండు రోజులు పాటు తెనాలిలో పర్యటించనున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..
* పల్నాడు: నేడు చిలకలూరిపేట 21వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడదల రజిని…
* బాపట్ల: అమృతలూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…
* పల్నాడు: ఈనెల 30న వినుకొండలో నాలుగవ విడత జగనన్న చేయూత, పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…
* శ్రీకాకుళం: నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయం లో వ్యవసాయ సలహా మండలి సమావేశం.. హాజరుకానున్న మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్
* శ్రీకాకుళం: అరసవల్లి రథసప్తమి సందర్భంగా పట్టనంలో ట్రాపిక్ ఆంక్షలు.. శ్రీకాకుళం నుంచి గార వెల్లే వాహనాలు దారి మల్లింపు.. అరసవెల్లి వెళ్లే భక్తులు 80 పీట్ రోడ్డ్ వద్ద వాహనాలు నిలిపి కలినడకన దేవాలయంకు చేరుకునేలా చర్యలు
* చిత్తూరు: నారా లోకేష్ యువగళం పాదయాత్ర… ఉదయం 10.30 గంటలకు కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి వరద రాజస్వామి గుడికి చేరుకుని పూజలు.. మధ్యాహ్నం బహిరంగసభ.. ట్రాఫిక్ ఐలాండ్ జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు. కుప్పం ప్రభుత్వాసుపత్రి క్రాస్, శెట్టిపల్లి క్రాస్, బెగ్గిలపల్లి క్రాస్, పిఇఎస్ మెడికల్ కాలేజి సమీపాన క్యాంప్ సెట్ కు చేరిక.. పిఇఎస్ మెడికల్ కళాశాల సమీపాన క్యాంప్ సైట్ కు చేరిక, విరామం.
* విజయనగరం: రాజీవ్ మైదానంలో నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు.