Nandamuri Taraka Ratna: స్పృహతప్పి పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు.. ఆయనకు స్టెంట్ వేసినట్టు తెలిపారు.. ఆయన ప్రస్తుతం స్సృహలోకి వచ్చినట్టు తెలుస్తోంది. కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. తీవ్ర అస్వస్థతకు గురై.. స్పృహతప్పి పడిపోయారు.. వెంటనే అప్రమత్తం అయిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన్ను.. ఆస్పత్రికి తరలించారు.. అయితే, ఆస్పత్రికి వెళ్లే సరికి ఆయన పల్స్ పడిపోయింది.. అప్పటికీ అసలు పల్స్ లేదని.. ఆ సమయంలో ఆయన శరీరం మొత్తం బ్లూగా మారిందని.. వెంటనే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టామని పెట్టాం.. 45 నిమిషాల తర్వాత పల్స్ మళ్లీ మొదలైందన్నారు వైద్యులు.. ఇక, ఆ తర్వాత సీపీఆర్ చేసిన వైద్యులు.. యాంజియో గ్రామ్ చేశారు.. తర్వాత తారకరత్న గుండెలో స్టెంట్ వేసినట్టు తెలిపారు.. దీంతో.. ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు.. పరిస్థితిని బట్టి ఆయన్ను బెంగళూరుకు తరలించే అవకాశం కూడా ఉంది.. ఇక, ఆస్పత్రికి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. అక్కడే ఉండి అబ్బాయి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
Read Also: Nandamuri Taraka Ratna: ఆస్పత్రికి వచ్చినప్పుడు తారకరత్నకు పల్స్ లేదు-వైద్యులు