Taraka Ratna Health Condition బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ప్రస్తుతం ఐసీసీయూలో తారకరత్నకు చికిత్స చేస్తున్నారు.. అత్యవసర చికిత్సలో భాగంగా ఎక్మో చికిత్స చేస్తున్నారు.. మరో 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం నుంచి నిన్న అర్ధరాత్రి నందమూరి తారకరత్నను బెంగళూరుకు తరలించారు కుటుంబ సభ్యులు.
Read Also: Rangareddy Crime: కామంతో మైనర్ పై అఘాయిత్యం.. 3 నెలల తరువాత బయటపడ్డ భాగోతం
బెంగళూరులో ఎక్మో చికిత్సను అందించే మూడు ఆస్పత్రిల్లో నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఒకటి.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత.. నారాయణ హృదయాలయ ఆస్పత్రియే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు.. ఆ తర్వాత కుప్పం నుంచి నిన్న రాత్రి బెంగళూరుకు తరలించారు కుటుంబసభ్యులు.. ప్రస్తుతం ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ఇప్పటికే బాలకృష్ణతో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు కూడా బెంగళూరులో ఉండగా.. ఇవాళ సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు చంద్రబాబు.. కాగా, నిన్న ఉదయం 11.20 గంటల సమయంలో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు తారకరత్న.. ఆ తర్వాత కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు.. ఇక, మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు..