Kotamreddy vs Anil Kumar Yadav: నెల్లూరు జిల్లా రాజకీయాలు అసలే కాకమీదున్నాయి.. వైసీపీ నేతలు, తిరుగుబాటు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అదికాస్తా ఇప్పుడు దాడుల వరకు వెళ్లింది.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల తర్వాత ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.. ఇప్పుడు అది ఘర్షణ వరకు వెళ్లింది.. నెల్లూరు బారా షాహిద్ దర్గా ప్రాంతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్…
TTD Board Meeting: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఈ రోజు సమావేశం కాబోతోంది.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడంతో పాటు.. వార్షిక బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలపనున్నారు. 398 అంశాల అజెండాపై నిర్ణయం తీసుకోనుంది పాలకమండలి.. ఇక, రూ.3,500 కోట్ల అంచనాతో 2023-24 వార్షిక బడ్జెట్‌కి ఆమోదం తెలపనున్నారు.. ఇక, అలిపిరి వద్ద స్పిర్య్టూవల్ సిటీ…
Lay Foundation Stone For Steel Plant: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న స్టీల్ ప్లాంట్‌కు ఇవాళ భూమిపూజ చేయనున్నారు.. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంటుకు భూమిపూజ చేస్తారు. అలాగే పులివెందులలో ఓ శుభకార్యంలో పాల్గొననున్నారు.. కడప జిల్లా పర్యటన కోసం ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ఉదయం 10.50 గంటలకు జమ్ములమడుగు మండలం…
Amaravati: అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా.. అమరావతిని చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకారం ఇస్తున్నారన్న ఆమె.. కేవలం పుణ్యక్షేత్రాల సందర్శన కాకుండా కుటుంబం మొత్తం అమరావతిలో పర్యటించే విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.. వాటర్ స్పోర్ట్స్ టూరిజం, టెంపుల్ టూరిజంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్న ఆమె.. ప్రపంచ దేశాల నుండి రాయల…
Blind Girl Murder Case: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో మైనర్ బాలిక దారుణ హత్యకు గురైన విషయం విదితమే.. ఆ అంధ బాలిక హత్యపై హోంమంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు.. ఆ బాలికను గంజాయి మత్తులో హత్య చేయలేదు.. వ్యక్తిగత కక్షతోనే అంధ బాలికను హత్య చేశారని స్పష్టం చేశారు.. అయితే, ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజంలేదని కొట్టిపారేశారు హోంమంత్రి తానేటి వనిత.. కాగా, తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా…
Tourist Police Stations: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికే ప్రజల రక్షణ కోసం.. ముఖ్యంగా మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలకు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు పర్యాటకుల భద్రతే లక్ష్యంగా మరో ముందడుగు వేసింది.. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఏపీ వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇవాళ జెండా ఊపి…
ఆ మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్ సీరియస్.. డెడ్ లైన్ పెట్టేశారు..! 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీరియస్ అయ్యారు. జూన్ 30లోపు పనితీరు మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించాల్సి వస్తుందంటూ సంబంధిత ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గడప గడపకు కార్యక్రమంపై సోమవారం రోజు సీఎం వైఎస్ జగన్…