Gannavaram to Shirdi: షిర్డీ భక్తులకు గుడ్‌న్యూస్.. గన్నవరం నుంచి విమాన సర్వీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gannavaram to Shirdi: షిర్డీ సాయిబాబాను దర్శించుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు.. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు బస్సులు, రైళ్లలో మాత్రమే షిర్డీకి వెళ్లే అవకాశం ఉంది.. త్వరలోనే విమానాల్లో కూడా షిర్డీ వెళ్లే అవకాశం దక్కనుంది.. విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.. మార్చి 26వ తేదీ నుంచి ఈ సర్వీసులు స్టార్ట్ కాబోతున్నాయట.. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ముందుకు రావడంతో పాటు ప్రయాణ షెడ్యూల్‌ను కూడా ప్రకటించడంపై సాయి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Jeevan Reddy : ప్రీతి కేసులో.. సిట్ విచారణ.. సిట్టింగ్ జడ్జితో జరపాలి
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఏటీఆర్ 72-600 విమానం.. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ రోజు మధ్యాహ్నం 12.25 గంటలకు బయల్దేరుతుంది.. అది మధ్యాహ్నం 3 గంటలకు షిర్డీ చేరుకోనుంది.. ఇక, షిర్డీ నుంచి ఏపీకి రావాల్సిన ప్రయాణికుల కోసం నడిపే మరో విమానం.. ప్రతీ రోజు మధ్యాహ్నం 2.20 గంటలకు షిర్డీ నుంచి బయల్దేరి.. సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. ఇక, విమాన టికెట్ ధరను కూడా ప్రకటించింది ఇండిగో.. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టికెట్ ధర రూ.4,246గా ఉండగా.. షిర్డీ నుంచి గన్నవరంకు రూ.4,639గా నిర్ణయించారు. రైళ్లు, బస్సుల్లో నానా ఇబ్బందులు పడి షిర్డీ వెళ్తున్న భక్తులు.. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. త్వరగా షిర్డీకి వెళ్లే సౌకర్యం రానుండడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!