YS Jagan Tenali Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు.. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ సంబంధించిన నిధులను విడుదల చేస్తారు. ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారంచుడతారు.. ఇక, ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది సీఎంవో.. ఈ నెల 28వ తేదీన అనగా మంగళవారం రోజు ఉదయం 9.50 గంటలకు తేడాపల్లిలోని క్యాంపు కార్యాలయంల నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న సీఎం జగన్.. ఉదయం 10.15 గంటలకు తెనాలిలోని కవిరాజ లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.. ఆ తర్వాత ఉదయం 10.35 గంటలకు సభా వేదిక దగ్గర ఏర్పా చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శిస్తారు..
Read Also: Ayyanna Patrudu: సుప్రీంకోర్టులో అయ్యన్నపాత్రుడుకి ఎదురుదెబ్బ.. దర్యాప్తునకు అనుమతి
తన పర్యటనలో మొదట వ్యవసాయా మార్కెట్ కమిటీలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సందర్శించనున్న సీఎం జగన్.. లబ్ధిదారులతో మాట్లాడనున్నారు.. ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు వైఎస్‌ఆర్ రైతుభరోసా-పీఎం కిసాన్ ఇన్‌ఫుట్ సబ్సిడీని విడుదల చేస్తారు.. అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో తెనాలి నుంచి బయల్దేరనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. మొత్తంగా తెనాలి పర్యటనలో నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధులను విడుదల చేయడంతో పాటు.. ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.. వర్చువల్ గా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.