Minister Botsa Satyanarayana: ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టి సారించింది అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని ఉపాధ్యాయులను కోరారు.. ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేసే ఆలోచనను విద్యార్థులు గుర్తించాలన్న ఆయన.. రాబోయే కాలంలో కమ్యూనికేషన్ ఆధారంగా ప్రతి తరగతిలో స్మార్ట్ టీవీ అందుబాటులోకి తీసుకువస్తాం అన్నారు.. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోరు ముద్ద, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు.
Read Also: Gannavaram to Shirdi: షిర్డీ భక్తులకు గుడ్‌న్యూస్.. గన్నవరం నుంచి విమాన సర్వీసులు
మరోవైపు.. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ అనేది నిషిద్ధం అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. ర్యాగింగ్ చేస్తే శిక్షతప్పదని హెచ్చరించిన ఆయన.. విద్యార్థులకు ఏ ఇబ్బంది ఉన్నా.. అధ్యాపకులకి చెప్పాలన్నారు.. స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు ర్యాగింగ్ పై అవగాహన కల్పించాలని సూచించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. కాగా, విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 260 ప్రభుత్వ పాఠశాల ప్రాజెక్టులను ప్రదర్శించారు.. ఈ ఎగ్జిబిషన్‌కు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, మేయర్ భాగ్య లక్ష్మి, కమిషనర్ స్వప్నికల్ దినకర్, విద్యాశాఖ అధికారులు.. తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.