Occult Worship in College Bus: ఓవైపు టెక్నాలజీ వైపు ప్రపంచం పరుగులు తీస్తుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజూ ఏదో ఒక చోట క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా కాలేజీ బస్సులోనే క్షుద్రపూజలు చేయడం కలకలం సృష్టిస్తుంది.. ఈ ఘటనతో ఏలూరు జిల్లా నూజివీడులో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.. బస్సులో నిజంగా క్షుద్రపూజలు చేశారా? లేక ఆకతాయిల పనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా…
CM YS Jagan Serious Warning: 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీరియస్ అయ్యారు. జూన్ 30లోపు పనితీరు మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించాల్సి వస్తుందంటూ సంబంధిత ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గడప గడపకు కార్యక్రమంపై సోమవారం రోజు సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేశారు. ఏ ఎమ్మెల్యే…
కేసీఆర్ కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా.. షెడ్యూల్ ఇదే.. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని సీఎం కేసీఆర్ బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. కానీ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి మంగళవారం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావించిన సీఎం తన పర్యటనను బుధవారం వాయదా వేసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. రేపు ఉదయం సీఎం…
Strange Weather Condition: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలేమో ఎండ దంచేస్తోంది.. రాత్రైతే చలి వణికిస్తోంది. ఫిబ్రవరిలోనే.. సమ్మర్ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పగటిపూట 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు.. రాత్రికి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల్లో అత్యధిక హెచ్చుతగ్గులతో.. జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. చలి వణికిస్తోంది. దీంతో రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి జిల్లా కుంతలంలో 7.5, జీకే…
* నేడు హైదరాబాద్‌కు టి.కాంగ్రెస్ ఇంఛార్జ్ థాక్రే.. సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సింధు ఇంటికి థాక్రే.. రేపు డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్‌తో సమావేశం * ప్రకాశం జిల్లా: పొదిలి శివాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా అశ్వవాహన ఉత్సవం, త్రిషులేశ్వరవతారంలో దర్శనం ఇవ్వనున్న స్వామివారు. * పల్నాడు: నేడు అమరావతిలో పర్యటించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు తదితరులు.. * అమరావతిలో జ్ఞాన బుద్ధ ప్రాజెక్టును…
హైదరాబాద్ నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోడాం, నూతన సచివాలయం, రామాంతపూర్‌లో వరుస ఘటనలు మరువకముందే తాజాగా కూకట్ పల్లిలోని పార్క్ షేడ్స్‌లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం భాగ్యనగర ప్రజలను భయాందోళనకు గురి చేసింది.