కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.. నేడు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఆయన.. ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు.. మిగతా జిల్లాల్లో…
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్న ఆయన.. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారక రామ తీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక, విశాఖపట్నం–మధురవాడలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్ధాపన చేస్తారు.. ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి సీఎం వైఎస్ జగ ఈ రోజు భూమి…
బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్ లో మార్చేయాలని పిలుపునిచ్చారు.. తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలన్న ఆయన.. దేవస్థానంలో ప్రమాణాలు చేసే రాజకీయాలు పెరిగిపోయాయి.. ఎప్పుడు ఏ జెండా పట్టుకుంటాడు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ దృష్టి సారించిన ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ (SSMPP)కి పర్యావరణ క్లియరెన్స్ (EC) ఇతర అవసరమైన అనుమతులను అధికారుల నుండి త్వరలో పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం (CWC), కేంద్ర పర్యావరణ & అటవీ మంత్రిత్వ శాఖకు పంపిన ప్రాజెక్ట్ తాజా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) అన్ని సంభావ్యతలలో, పర్యావరణ…
Two Wheeler Sales: ఆంధ్రప్రదేశ్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో -8.03 శాతం మేర నెగెటివ్ గ్రోత్ రేట్ నమోదు చేశాయి ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.89 లక్షలుగా ఉన్నాయి.. ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.34 లక్షలు.. అంటే, అమ్మకాలు భారీగా పడిపోయాయి.. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 55 వేలకు పైగా ద్విచక్ర…
Balineni Srinivasa Reddy: మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా విషయంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.. నాలుగు రోజుల క్రితం వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి సమాచారమిచ్చారు బాలినేని.. ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని.. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు పార్టీ పెద్దలకు సమాచారాన్ని చేరవేశారు. అయితే, రాజీనామా వ్యవహారంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి…
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందన్న ఆయన.. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారు. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు..
Papikondalu Tour Cancel: వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో వానలు కురుస్తున్నాయి.. వడగాలులు వీయాల్సిన వేళ.. ఈదురుగాలులు వణికిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు.. చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రను నిలిపివేసింది.. ఇప్పటికే పలుమార్లు.. పాపికొండల టూర్ వాయిదా పడగా.. ఇప్పుడు మరోమారు బ్రేక్ పడింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ…