Thunderstorm and Rain: ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి.. వడగాలులు వృద్ధుల ప్రాణాలు తీస్తున్నాయి.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.. పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుండగా.. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, ఈ రోజు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనుండగా.. సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవవచ్చు అని పేర్కొంది. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశంఉన్నందున చెట్ల కింద ఉండరాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.