మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్దాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా నీ స్దాయి ఏంటి.. నోటికోచ్చినట్లు మాట్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదానికి ఒక మంచి భాషా కూడా మాట్లాడలేకున్నావ్.. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయినా నువ్వు ఇప్పుడు వందల ఎన్ని కోట్లు ఎలా సంపాదించావో సీబీఐ ఎంక్వైరి కోరే దమ్ము నీకుందా అని ఆమె ప్రశ్నించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రికి పైకి భవానీలు పోటెత్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగిపోతుంది. ఇవాళ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గదేవీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూలైన్ లలో భక్తులు వేచి ఉన్నారు.