DK Shivakumar: తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ ఉంది.. కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒకరోజు కాంగ్రెస్ పార్టీ మరల ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. పని చేసేవాడిని జాగ్రత్తగా చూసుకుంటే పార్టీ బలంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ చరిత్ర దేశ చరిత్ర.. పాలిటిక్స్ లో ఎవరూ శాశ్వతం కాదన్నారు. ఏపీ రాజధాని అంశం, ప్రత్యేక హోదా, అభివృద్ధి అంశాలపై కాంగ్రెస్ ఏపీకి కమిట్మెంట్ ఇచ్చింది.. జాతీయ పార్టీలు యాక్టివ్ గా లేకపోవడం ఏపీలో అభివృద్ధి లేకపోవడానికి కారణంగా తెలిపారు.
ఇప్పుడు ఇండియా కూటమిగా మనతో చాలా పార్టీలు కలిసి పని చేస్తాయి.. 2024 ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు డీకే శివకుమార్.. కాంగ్రెస్ కారణంగా దేశం సంయుక్తంగా ఉంది.. నమ్మకాన్ని కోల్పోవద్దు.. సమస్యలపై పోరాడండి.. కలిసి, ఆలోచించి, పనిచేయాలి.. అదే గెలుపునకు కారణం అవుతుందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్.
ఇక, సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. డీకే ఒక ట్రబుల్ షూటర్.. ఆంధ్రప్రదేశ్ కోసం కూడా డీకే పనిచేస్తారు అని తెలిపారు.. డీకే శివకుమార్ లాంటి నేత కారణంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తోందని ప్రశంసలు కురిపించారు. రెండు ప్రభుత్వాలను చూశాం.. కేంద్రం సహకరిస్తేనే ఏపీ బాగుపడుతుంది… ఏపీ అభివృద్ధి లో శివకుమార్ కృషి కూడా ఉంటుందన్నారు రఘువీరారెడ్డి.