Grama Sachivalayam Locked: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది.. రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఉన్న గ్రామ పంచాయితీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మార్చారు.. కొన్ని ప్రాంతాల్లో కొత్త భవనాల నిర్మాణం జరిగింది.. మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లోనే గ్రామ సచివాలయాలను నిర్వహిస్తున్నారు. అయితే, అద్దె చెల్లించని కారణంగా సచివాలయ కార్యాలయానికి తాళం వేశాడు.. ఆ ఇంటి యజమాని.. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Read Also: Liquor Sale : ఢిల్లీలో భారీగా మద్యం అమ్మకాలు.. 15 రోజుల్లో 2.58 కోట్ల సీసాలు
చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఆ ఘటనకు సంబంధించ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీ.కోట మండలంలో అద్దె చెల్లించలేదని పడగలకుప్పం గ్రామా సచివాలయానికి తాళం వేశాడు ఇంటి యజమాని.. పంచాయతీ భవనానికి అద్దె చెల్లించలేదని తాళం వేశారు. అయితే, ప్రభుత్వ కార్యాలయానికి తాళం వేయడంతో పనుల కోసం వచ్చిన స్దానికులు నిరాశగా వెనుతిరగాల్సి వస్తుంది.. ప్రజలకు సమాచారం కోసం తాళం వేసిన డోర్‌కు ఓ నోటీసు బోర్డు అంటించారు సచివాలయ సిబ్బంది.. “గ్రామ సచివాలయం అద్దె ఇవ్వని కారణంగా ఇంటి యజమాని తాళాలు వేయడం జరిగింది.. అందువల్ల కార్యాలయం మూసివేయడం జరిగింది” ఇట్లు గ్రామ సచివాలయ సిబ్బంది పడిగలకుప్పం.. అంటూ నోటీసు అంటించారు. అయితే, సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.