ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 10.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు-2023ని అందజేయనుంది. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు (బుధవారం) విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు.
చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు సంతోషకరం అన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డా. చింతా మోహన్.. అయితే, చంద్రబాబును మరలా అరెస్ట్ చేసే తప్పు చేయొద్దని సూచించారు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్పై స్పందిస్తూ సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. హై కోర్టులో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారన్న ఆయన.. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని టీడీపీ నాయకులు హంగామా చేస్తున్నారు.. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానాలి.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.