శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను ఈ రోజు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వచ్చే ఏడాది అంటే 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ రోజు విడుదల చేయనున్నారు.. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో పథకం డబ్బులను విడుదల చేశారు.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని ఈ రోజు రిలీజ్ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి.. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులు.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు..
విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.. ఈ ప్రమాదంలో బోట్లు తగలడడంతో తీవ్ర నష్టం కలిగింది.. అయితే, బోట్ల యజమానులకు ఈ రోజు పరిహారం పంపిణీ చేశారు.. 49 బోట్లకు రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఈ రోజు మత్స్యకారులకు పరిహారం పంపిణీ చేశారు