ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ.. ఇన్నాళ్ల ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపుగా సమాధానం ఇచ్చేసింది. మూడు రాజధానుల ఏర్పాటుపై వడివడిగా అడుగులేస్తున్న జగన్ సర్కార్.. విశాఖ నుంచి పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసింది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల ఇన్నాళ్లూ జాప్యం జరిగినా.. డిసెంబర్ 8వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి
బోటులో ఉప్పు చేప ఫ్రై చేస్తున్న సమయంలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.. మద్యం మత్తులో మంచింగ్ కోసం ఉప్పు చేప ఫ్రై చేస్తుండగా.. అగ్నిప్రమాదం సంబంధించి 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోవడానికి కారకులు అయ్యారు ఇద్దరు వ్యక్తులు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో నేను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు నాని.. వేరే ప్లేస్ లో నా స్నేహితులకు పార్టీ ఇచ్చాను.. రాత్రి 11.45 గంటల సమయంలో నాకు బోట్లు తగల బడుతున్నట్టు ఫోన్ వచ్చింది.. దీంతో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా నేను హార్బర్ కు వెళ్లాను.. నేను వెళ్లే సమయానికి బోట్లు తగల బడుతున్నాయి అని తెలిపాడు.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిపోయిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్‌బాయ్ నాని.. హైకోర్టు మెట్లు ఎక్కారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు నాని..
అనంతపురం లోని గుత్తికి చెందిన ప్రశాంత్ నాయుడు అలానే ప్రకాశం జిల్లాకు చెందిన రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తు కలిసి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకున్నారు.