అమ్మలగన్న అమ్మకు కోటి గాజుల అర్చన, నాగసాధువులచే మహా రుద్రాభిషేకం, ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కోటి దీపోత్సవం నాగసాధువులచే మహా రుద్రాభిషేకం కొనసాగింది. సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటిగాజుల అర్చన జరిగింది.
ఏపీ విభజన చట్టంలోని అంశాలు- అమలుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇవాళ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, విద్యా సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, 13వ షెడ్యూల్ అనుసరించి ఆస్తుల విభజన తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
మార్కాపురం నియోజక వర్గంలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో శాసన సభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిదులతో పాటు అధికారులు హాజరయ్యారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల నేపథ్యంలో.. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను టీడీపీ బృందం కలిసింది.
Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో ప్రమాదంపై విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారణ కొనసాగుతున్న విషయం తెల్సిందే. యూట్యూబర్ లోక ల బాయ్ నాని తన భార్య సీమంతం పార్టీని బోట్ లో గ్రాండ్ గా నిర్వహించడం వలనే ఆ అగ్నిప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ అగ్నిప్రమాదాన్ని సైతం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడంతో లోకల్ బాయ్ నానిపై కేసు నమోదయ్యింది.
అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్కులతో ఏం చేస్తున్నారో ఈ మధ్యే బయట పడింది అని అన్నారు.
ప్రకాశం జిల్లా లోని ఒంగోలు లోని రిమ్స్ వైద్య కళాశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మూడవ సంవత్సరం విద్యార్థులు క్లాస్ క్లాస్ రూంలో రెచ్చి పోయారు. గత కొంత కాలంగా మూడవ సంవత్సరం విద్యార్థుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకరి పైన ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు.