టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు రెడీ అవుతున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు. రేపు పొన్నూరు, వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్లబోతున్నారు.
నేడు విశాఖపట్నంలో ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ జరుగనుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో పలువురు వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు చేరనునన్నారు. ఇక, మధ్యాహ్నం నగరానికి జనసేన చీఫ్ రానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సమస్యలు, తుఫాన్ నష్టం, రైతులు పడుతున్న ఇబ్బందులు, తాజా రాజకీయాలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారని పార్టీ వర్గాల వెల్లడించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్రెడ్డి, సీతక్క ఫొటోలతో ఓ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. జువ్వలపాలెం రోడ్ లో రేవంత్ రెడ్డి, సీతక్క ఫ్లెక్సీలను పివిటి బ్రదర్స్ పేరుతో ఏర్పాటు చేశారు..
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా ఉంది.. నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తప్పు అన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాజీ ఎన్నికల కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్..