నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న జగన్.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్నారు..
క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రేపు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు.. అందులో భాగంగా ముందుగా తిరుపతి, బాపట్ల జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.
గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గ్రూప్ -2 తాజా నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566లు భర్తీ చేయనున్నారు..