బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచౌంగ్ తీరం దాటింది. ఏపీలోని బాపట్ల సమీపంలో తుఫాన్ తీరం దాటిన సమయంలో బీభత్స వాతావరణం కనిపించింది. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హోరెత్తింది. సముద్రంలో అలలు... ఐదు నుండి ఆరు అడుగుల మేర ఎగిసిపడ్డాయి. అల్లవరం సమీపంలో సముద్రం అలకల్లోలంగా మారింది.
కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిడ్డంతో పట్టాలు తప్పింది గూడ్స్ రైలు ఇంజన్.. శివలింగపురం యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.. దీంతో, కేకే లైన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి
ఆంధ్రప్రదేశ్లో ఎస్సై నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. అభ్యర్థుల ఎత్తు కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించారు.. రిక్రూట్ మెంట్ బోర్డ్ కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోలడంతో అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చింది హైకోర్టు.
మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పని చేస్తుంది అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విపత్కర పరిస్దితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రతీ రెండు గంటలకు అప్ డేట్స్ తీసుకుని తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
Cyclone Michaung: మిచాంగ్ తుఫాను సోమవారం (డిసెంబర్ 4) తీవ్ర తుఫానుగా మారింది. ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 80 కి.మీ, చెన్నైకి ఉత్తర-ఈశాన్య దిశలో 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.