Merugu Nagarjuna: చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి.. దళితులపై చంద్రబాబు అమానుషంగా కేసులు పెట్టారు అని మండిపడ్డారు మంత్రి మేరుగు నాగార్జున.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. అయితే, చంద్రబాబు అమానుషంగా పెట్టిన కేసులను సీఎం వైఎస్ జగన్ ఎత్తేశారని గుర్తుచేశారు. ఇక, చంద్రబాబుకు మతిస్థిమితం లేదు.. ఇది ఎప్పటి నుంచో చెపుతున్నాం. నిన్న చంద్రబాబు రాష్ట్రంలో 7 వేల కోట్ల క్రైస్తవ ఆస్తులు కాజేస్తున్నామని ఆరోపించారు.. అసలు మా గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు. క్రైస్తవ ఆస్తుల కోసం వెంపర్లాడింది చంద్రబాబు, టీడీపీ నేతలని విమర్శించారు. రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారు.. గుంటూరు, విజయవాడలో ఎన్ని క్రైస్తవ ఆస్తులు అమ్ముకున్నారో చూపిస్తాం అంటూ సవాల్ చేశారు.
Read Also: High Court: “నలుపు రంగులో ఉందని భార్యకు విడాకులు”.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఎన్నికలు వస్తున్నాయని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. చంద్రబాబు ఓ గజదొంగ.. మా మీద దాడులు, అఘాయిత్యాలు చేయించారని విరుచుకుపడ్డారు నాగార్జున.. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు.. క్రైస్తవ ఆస్తులుపై చర్చకు సిద్ధం అంటూ ఓపెన్ చాలెంజ్ విసిరారు.. అయితే, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. దళితుల మద్దతు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది.. వచ్చే ఎన్నికల్లో ఎందరు కలిసి వచ్చినా గెలిచేది వైసీపీయే.. మరోసారి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి మంత్రి మేరుగు నాగార్జున.