Perni Nani: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్నినాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తారకరత్న కన్నుమూసినా ఆగని యువగళం పాదయాత్ర.. చంద్రబాబు జైలుకు వెళ్లగానే ఆగిపోయిందని విమర్శించారు. టీడీపీ ఏం కష్టాల్లో ఉంది..? ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్నానని పవన్ కల్యాణ్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది..? అంటూ జనసేనా అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇప్పటం సభలోనే పవన్.. టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారని.. చంద్రబాబుకు అధికారం ఇమ్మని పవన్ కల్యాణ్ అడుగుతున్నారని దుయ్యబట్టారు.
Read Also: Fighter: మరోసారి హీట్ పెంచేసిన దీపికా .. ఈసారి ఆ హీరోతో..
యువగళం 4వేల కిలో మీటర్ల 400 రోజులన్నారు. కానీ, లోకేష్.. జంపింగ్ జపాంగ్ యాత్ర చేశారని సెటైర్లు వేశారు పేర్ని నాని.. యువగళం పాదయాత్రలో నందమూరి కుటుంబ సభ్యుడు చనిపోయినా యాత్ర ఆగలేదు.. కానీ చంద్రబాబు జైల్లో ఉంటే మాత్రం యాత్ర ఆపేశారని ఫైర్ అయ్యారు. ఇక, లోకేష్ నడిచిన దూరం కాకి లెక్కలు వేశారు. లోకేష్ చేసింది మొక్కుబడి యాత్ర మాత్రమే అన్నారు. కమ్మలు, రెడ్లకేనా రాజ్యాధికారం.. మనకు వద్దా అని పవన్ కల్యాణ్ గతంలో ప్రశ్నించారు. మరిప్పుడు ఎవరికి రాజ్యాధికారం ఇవ్వడానికి పవన్ వచ్చారని నిలదీశారు. పవన్ కల్యాణ్ తన మనుషులతో నన్ను, అంబటి రాంబాబుని, కన్నబాబులని తిట్టించాడు.. వైఎస్ జగన్ పాలేర్లని పవన్ మమ్మల్ని తిట్టించాడు. మరి ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏం చెప్తాడు..? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.