తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్.. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరనున్నట్టు తెలిపారు.. అంతేకాదు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైనా సమయమని పిలుపునిచ్చారు. ఇక, చిరంజీవిని నేనే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తానని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తు్న్నారు.. కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు చేశారు.. బరుల వద్ద పందెరాయుళ్ల కోసం అత్యాధునిక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. పందేలు కాసేవాళ్లను కవ్వించి.. వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసేందుకు పందేంరాయుళ్లకు సమయం వచ్చేసింది.. ఇక, ఎన్నికల ఏడాది కావడంతో.. రాజకీయ నాయకుల తోడ్పాటు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.