పల్నాడు జిల్లా సత్తనపల్లి గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు అధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంక్రాంతి వేడుకలకు ప్రజలు భారీగా హాజరు అయ్యారు. భోగి వేడుకలలో భాగంగా మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక డాన్స్ చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మూడ్రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేసుకుని.. వాటి చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు.
2024లో జరిగే ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్న వేళ నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి దూకుడు పెంచారు.