Bonda Uma: రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పుడు.. అవి పొత్తు ధర్మాన్ని పాటించాలి.. కానీ, తెలుగుదేశం పార్టీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాకరేపాయి.. అంతే కాదు.. పొత్తు ధర్మం పాటించకుండా వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు.. కాబట్టి మేం రెండు సీట్లు ప్రకటిస్తాం అంటూ… రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తోంది అంటూ జనసేనాని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ-జనసేన మధ్య ఏదో జరుగుతోంది? అనే ప్రచారం తెరపైకి వచ్చింది.. ఈ పరిణామాలపై స్పందించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పవన్ కల్యాణ్ కామెంట్లను స్వాగతించిన టీడీపీ.. పవన్ సీట్ల ప్రకటనపై తమకేం ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.
Read Also: Minister Ambati Rambabu: జనసేన కార్యకర్లకు పవన్ సమాధానం చెప్పాలి.. మంత్రి అంబటి డిమాండ్
అసలు పవన్ కల్యాణ్ కామెంట్లల్లో తప్పేం లేదు అన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయ్యాయని తెలిపారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది.. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారన్నారు. జనసేన ప్రకటించిన సీట్ల విషయంలో మాకేం ఇబ్బంది లేదన్న ఆయన.. పవన్ కామెంట్ల మీద మాకు లేని బాధ మీకెందుకు..? పవన్ రెండు సీట్లు కాకుంటే.. నాలుగు సీట్లు ప్రకటిస్తారు.. వైసీపీకేంటి? అంటూ సెటైర్లు వేశారు. పవన్ కామెంట్లు చేసిన గంటలోనే ఐదుగురు వైసీపీ నేతలు మాట్లాడేశారు. మాది పవిత్ర పొత్తు.. కేసుల నుంచి తప్పించుకోవడానికి వైసీపీ పొత్తు పెట్టుకుంటోందని దుయ్యబట్టారు. టీడీపీ-జనసేన పొత్తులు ఎప్పుడు విచ్ఛిన్నం అవుతాయా..? అని వైసీపీ గోతి కాడ నక్కలా కూచుకుని కూర్చొంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బోండా ఉమామహేశ్వరరావు.