ఎంపీ కేశినేని నాని.. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. విజయవాడ ద్రోహి చంద్రబాబు.. పొరపాటున కూడా గెలవడు అని జోస్యం చెప్పారు.. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా బయటపెట్టారు.. టీడీపీకి 54 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని స్పష్టం చేశారు.
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్టీ నన్ను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి నిత్యం జనంలో ఉన్నా.. పెత్తందార్ల మాట కోసం నన్ను పక్కనబెట్టారని అసహనం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో ఏం జరుగుతుందో పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంలేదన్నారు. చింతలపూడిలో పెత్తందార్లకు పేదలకు మధ్య యుద్ధం జరిగింది.. కానీ, పార్టీ అధినేత జగన్ పెత్తందారులకే ప్రాధాన్యత ఇచ్చారని కామెంట్ చేశారు.