ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే అంటున్నారు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. ఈ ప్రభుత్వ హయాంలో మంత్రాలయంలో అభివృద్ధికి నోచుకోలేదు.. తాను విజయం సాధించి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తాఅంటున్నారు.
జోగి రమేష్.. నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు.. జోగి ఇంఛార్జి అవ్వగానే దళిత అధికారులను వేధిస్తున్నాడని వైసీపీ రాష్ట ఎస్సీ సెల్ కన్వీనర్ రాజీనామా చేయడం మరో వివాదానికి దారితీసినట్టు అయ్యింది.. అసమ్మతి రాగాల నడుమ జోగి రమేష్ తొలి పర్యటన ఎలా సాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.