ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి మొదటి రోజు భోగి సందర్భంగా ఊరూరా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు. ఇక సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతుంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి.. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు రుద్రరాజు..
పెనమలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి పెనమలూరుతో నాకు సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.. వంగవీటి రంగా అనుచరుడిగా నేను ఇక్కడి వారికి పరిచయమే అన్నారు మంత్రి జోగి రమేష్
ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే ఈ పరిస్థితులు లేవు అన్నారు మోహన్‌బాబు.. కులాలు అనేవి లేవు, తెలిసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతున్నారు.. కానీ, మోడీ ఒక్కరే అందరూ కలిసుండాలని చెప్పారన్నారు.
సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత కారణాలు వారికున్నాయన్నారు వైవీ.. సీట్ల మార్పు విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారన్న ఆయన.. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్థులకు సీట్లు ఉండవని ముందు నుంచి సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారని గుర్తు చేశారు. సీట్లు ఇవ్వని వారు కొత్తవాళ్లతో అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది.. కానీ, అన్నీ సర్దుబాటు అవుతాయన్నారు.
సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభలతీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు. దాదాపు నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ జగ్గన్నతోటలో, జరిగే ప్రభలతీర్థానికి దేశ స్థాయిలో ప్రత్యేకగుర్తింపు ఉంది.