భీమిలీలో వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభ దగ్గర ఎన్టీవీతో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మేం దేనికైనా సిద్దం.. అభివృద్ధి చూపించేందుకు సిద్దం.. కలిసి వస్తున్న రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. వైనాట్ 175 నినాధం మొదటి నుంచి వినిపిస్తున్నాం.. నేడు అదే నినాధంతో సిద్దమౌతున్నాను అని ఆయన వెల్లడించారు
జగన్ రెడ్డి పాలనలో కేవలం రాజకీయ నిరుద్యోగల కోసమే బీసీ కార్పొరేషన్లు పెట్టారు.. బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు పేరుకే బీసీలు.. అధికార పెత్తనం అంతా వైసీపీ అగ్ర కుల పెద్దలదే అని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు.
విజయవాడలో మూడు దారులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, దేవులపల్లి అమర్, ఆర్.వి.రామారావు పాల్గొన్నారు. రాజకీయ రంగాన భిన్న దృశ్యాలు అంశంతో దేవులపల్లి అమర్ పుస్తకం రచించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలోని వైసీపీలో లేఖ కలకలం రేపుతుంది. నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంపై ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ పరిశీలకుడు ఆశోక్ కుమార్ కు ఎమ్మెల్యే లేఖ రాశాడు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు.
నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘రా.. కదలిరా’ సభ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని.. 11:15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11:50 గంటలకు పీలేరుకు చేరుకోనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించడానికి భీమిలీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.