MP GVL Narasimha Rao: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు..! ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి టీడీపీ-జనసే-బీజేపీ కలసి పనిచేసే దశగా చర్చలు సాగుతున్నాయి.. ఇప్పటికే జనసేన-బీజేపీ పొత్తులో ఉండగా.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు చిగురించింది.. ఇక, మూడు ఒకేతాటిపైకి రావడమే మిగిలిఉంది.. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చలు జరిపివచ్చారు. ఇక, పొత్తులపై చర్చలు జరుగుతున్నట్టు ఓ దశలో అమిత్‌షా కూడా ప్రకటించారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ జట్టు కట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి పొత్తుపై పార్టీ అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయం అని స్పష్టం చేశారు.
Read Also: Kamareddy: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన.. సర్కార్ సీరియస్..!
Also Read
ఇక, విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నది బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందని తెలిపారు జీవీఎల్.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘాంగా సేవలు అందించిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న రావడం చాలా గొప్ప విషయం అన్నారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వ్యక్తికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. కానీ, బీజేపీకి కాంగ్రెస్ పార్టీలా వ్యత్యాసం లేదు.. దేశానికి వ్యక్తులు అందించిన సేవలతోనే సంబంధం అని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పీవీ నరసింహరావు జయంతి రోజు సెలవుగా ప్రకటించాలి, మెమోరియల్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయబడింది.. అని చాలా సార్లు చెప్పాను అని గుర్తుచేశారు.. మరోవైపు.. తమ ఉనికి కాపాడుకోవడం కోసం వైఎస్ షర్మిల వంటివాళ్లు టీవీల్లో కనిపించడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!