పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి.. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ రావాలని చెప్పండి.. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి.. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి.. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే.. ప్రజలే.. నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చాయి వైసీపీ శ్రేణులు.. సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ సభా వేదిక నుంచి.. యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.. వారి నుంచి సిద్ధం అంటూ సమాధానాన్ని రాబట్టారు..
మరో 70 రోజుల్లోనే ఎన్నికలు వస్తాయని క్లారిటీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. భీమిలి సంగివలసలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం జగన్.. 'సిద్ధం'పేరుతో వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది.. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవసైన్యం కనిపిస్తోందన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చాం.. ఇప్పటి వరకు 99 శాతం హామీలు నెరవేర్చాం.. 175 స్థానాలకు 175…