అసలు పవన్ కల్యాణ్ కామెంట్లల్లో తప్పేం లేదు అన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయ్యాయని తెలిపారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది.. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారన్నారు.
టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారంలో తాజా పరిణామాలపై హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పొత్తు ధర్మాన్ని పాటించక పోయినా చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ ఎందుకు ప్రయాణం చేస్తున్నారో జనసేన కార్యకర్తలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొత్తు ధర్మం లేకపోయినా, ప్యాకేజీ ధర్మం గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారా..? అని ఎద్దేవా చేశారు.. అసలు ఈ దేశంలో ఏ ధర్మాన్ని పాటించని వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.
నెల 30వ తేదీన ఏలూరులో వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది.. అయితే, ఈ నెల 30వ తేదీన తలపెట్టిన సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎమ్మెల్యేలను విచారణకు రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుందని.. ఈ రోజు ఉదయం పూట విచారణకు రావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం సమయంలో విచారణకు రావాల్సిందిగా టీడీపీ రెబెల్స్‌కు నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అందులో భాగంగా త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.. పొత్తుల విషయంలో బీజేపీతో క్లారిటీ తీసుకోనున్నారు. పొత్తులపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరపనున్నారు.. ఇక, పవన్ కల్యాణ్‌తో భేటీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.