Srikalahasthi Temple: శ్రీకాళహస్తీ ఆలయంలో అర్ధరాత్రి కలకలం రేగింది.. ఓ బాలుడు అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఘటన రచ్చగా మారింది.. ఆలయం మూసివేసిన తరువాత 13 సంవత్సరాల వయసులో ఉన్న మైనర్ బాలుడు ఆలయ ప్రహరీ గోడ నుండి నిచ్చెన ద్వారా ఆలయంలోకి ప్రేవేశించాడు.. తిరిగి అదే గోడ దూకుతుండగా కార్ పార్కింగ్ వద్ద బాలుడ్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు భక్తులు. ఆలయ సీసీ కెమెరాలో సైతం బాలుడు ఆలయంలో తిరుగుతున్న దృశ్యాలు రికార్డు…
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై నాలుగు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు.. వంశీపై నాలుగు కేసుల్లో విచారణ చేస్తున్న ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది న్యాయస్థానం..
నేను పార్టీ మారుతున్నాను అని నా పై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా నన్ను ఎమ్మెల్యేను చేశారు.. నేను జీవితాంతం వైఎస్ జగన్ తోనే ఉంటాను అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు అనగా 3వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. అయితే, ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు అధికారులు..