ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్.. ఘటన జరిగిన గంటల 14 గంటల వ్యవధిలో నిందితుడిని గుర్తించాం.. ఎమ్మార్వో హత్య కేసుకు ల్యాండ్ ఇష్యు నే కారణంగా పేర్కొన్నారు. నగరానికి చెందిన ఓ రియల్టర్ ఎమ్మార్వో హత్యకు పాల్పడ్డట్టు ఆధారాలు లభ్యమయ్యాయి..
విజయవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ - జనసేన మధ్య ముసలం మొదలైంది.. టీడీపీ నేతలు బాద్దా వెంకన్న, జలీల్ ఖాన్‌పై జనసేన పశ్చిమ ఇంఛార్జ్ పోతిని మహేష్ విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు వీరంతా ఎక్కడున్నారు? అంటూ ఫైర్ అయ్యారు. గాలిబ్ షా ఆస్తులు , జుమ్మా మసీదు ఆస్తులు కొట్టేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కులాలు, మతాల ముసుగులో రాజకీయాలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదని.. ఈ చట్టంపై అడ్వకేట్స్ కొన్ని అభ్యంతరాలు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో త్వరితగతిన రీ సర్వే పూర్తి అవుతుందని ఆయన ప్రకటించారు. ఇంకా రూల్స్ తయారు చేయలేదు , అసెంబ్లీ చర్చించలేదని.. న్యాయవాదుల సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.