ఓ వైపు అల్లుడిని కోల్పోయిన బాధ వారిని వెంటాడుతూనే ఉంది.. ఇప్పుడు కూతురు కూడా కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది.. అయితే, ఆ దుఃఖాన్ని దిగమింగుతూ పలువురు జీవితాల్లో వెలుగు నింపారు.. ఇంకా కొందరికి ప్రాణదానం చేశారు.. ఆ దంపతులు.. కర్నూలుకు చెందిన పావని లత అనే మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో కిడ్నీలు, కాలేయం, మూత్రపిండాలు, కళ్లు.. ఇలా అవయవాలను దానం చేశారు.
చంద్రబాబు ఏనాడూ మంచి చేసింది లేదు.. కానీ, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి లాగి వెళ్లారని విమర్శించారు సీఎం వైఎస్ జగన్.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించారు..
త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. ఎనిమిదో తేదీన భేటీ కావాలని చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు
ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని తెలిపారు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. మంగళవారం విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు.