ఈ రోజు డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి శ్రీశ్రీశ్రీ పూజ్య గురువులు గణపతి సచ్చిదానంద స్వామీజీ శంకుస్థాపన చేశారు.
ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా నిన్నటి సీన్ రిపీట్ అయింది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు వెళ్లారు.