MP Vijayasai Reddy: ఎన్నికలకు ప్రచారంలో భాగంగా సిద్ధం పేరుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తుంది.. ఈ మధ్యే రాప్తాడులో జరిగిన సభ పెద్ద చర్చకు దారి తీసింది.. అయితే, నెల్లూరు జిల్లాలో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. సిద్ధం సభ వచ్చే నెల 3వ తేదీన మేదరమెట్లలో నిర్వహిస్తాం అన్నారు.. నాలుగున్నారేళ్లలో ప్రభుత్వం అందించిన పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. నెల్లూరు.. తిరుపతి.. ఒంగోలు లోకసభ పరిధిలోని అసెంబ్లీ నేతలతో నెల్లూరు సమావేశంలో చర్చించాం.. మూడు సిద్ధం సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.. భీమిలి.. దెందులూరు.. రాప్తాడు సభలు విజయవంతం అయ్యాయి.. సభలకు లక్షలాది మంది తరలి వచ్చారని తెలిపారు. ఇక, మెదరమెట్ల సభకు 15 లక్షల మందికి పైగా వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సిద్ధం సభలో 2024 నుంచి 2029లో ఏమి చేయబోతున్నారో సీఎం వైఎస్ జగన్ వివరిస్తారని తెలిపారు విజయసాయిరెడ్డి.. ఎన్నికల సమయంలో కొందరు నేతలు వెళ్తారు.. కొందరు వస్తారు.. ఇది సర్వ సాధారణమే అన్నారు.. అయితే, వేమిరెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పడంపై స్పందించిన ఆయన.. వేమిరెడ్డి సౌమ్యుడే.. పార్టీ నేతలు ఎవరూ ఆయనను దూషించరని స్పష్టం చేశారు. నెల్లూరు లోక్ సభకు శరత్ చంద్రా రెడ్డి పోటీ చేయరు అని తెలిపారు. సోషల్ మీడియాలలో కొందరు ప్రచారం చేస్తున్నారు.. కానీ, వచ్చే వారంలో నెల్లూరు లోక్ సభ అభ్యర్థిని నిర్ణయిస్తాం.. రెండు.. మూడు రోజుల్లో జిల్లా అధ్యక్షుడిని నియమిస్తామని వెల్లడించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి..