Jogi Ramesh: విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో నాలుగు గంటలుగా వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఉన్నారు. జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన ఇంటిలో సిట్ అధికారుల తనిఖీలు చేపట్టారు.
Jogi Ramesh PA: ఇవాళ ఉదయం జోగి రమేష్‌తో పాటు పీఏ ఆరేపల్లి రామును అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉదయం 12 గంటల సమయంలో జోగి పీఏ ఆరేపల్లి రామును బయటకు వదిలి పెట్టారు.
YS Jagan: వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Former CJI NV Ramana: గత ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీఐటీ యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేసినా భరించానన్నారు. వ్యవస్థలు కష్టకాలంలోనే పరీక్షకు గురవుతాయన్నారు. గత పాలకుల నిర్ణయాలతో అమరావతి కష్టాలకు గురయ్యిందన్నారు. రైతుల కష్టం, త్యాగంతో అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థపై రైతులు నమ్మకం…
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం.. ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా వైసీపీ నేతలు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారు.. ఈ కేసులో కస్టడీలో ఉన్న ఏ-1 నిందితుడు జనార్థన్ రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు.
Jogi Ramesh Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
YS Jagan : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు పరిపాలన వైఫల్యమే కారణమని ఆయన ఎక్స్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు. “ప్రతిరోజూ పరిపాలనలో తనను మించిన వారు లేరని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు… వాస్తవానికి పరిపాలనలో ఘోర వైఫల్యాలు చేస్తున్నారని” జగన్ ఎద్దేవా చేశారు. “కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. రాష్ట్రంలోని పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను…
Jogi Ramesh : వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బద్నాం చేసి వైసీపీని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నారా వారి సారా ఎపిసోడ్‌ను బయటపెట్టిన తర్వాతే తమపై కుట్రలు మొదలయ్యాయని ఆయన అన్నారు. జోగి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా వారి సారా ఎపిసోడ్ గురించి అందరికీ వివరించా. ఇబ్రహీంపట్నం తయారీ కేంద్రం వద్దకు వెళ్లి నిజాలు బయటపెట్టా. అక్కడ తయారైన సారా…
Off The Record: ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్ర లేచినట్టు… తెగ హడావిడి చేసేస్తున్నారు ఆ మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని సదరు నేత.. ఇప్పుడు మాత్రం పిలవకుండానే పలుకుతూ… ఇక్కడెవరన్నా నన్ను పిలిచారా అంటూ డైరెక్ట్‌గా సీన్లోకి వచ్చేస్తున్నారట. ఇంతలోనే అంత మార్పు ఏంటి? ఎవరా లీడర్? పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు పే…ద్ద భరోసా వచ్చిందన్నది నిజమేనా? మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్…