Gadikota Srikanth Reddy: రాయచోటి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఆయన తాజాగా ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఓట్ల గణాంకాలను వివరంగా వెల్లడించారు. ఇక ఆయన తెలిపిన సమాచారం మేరకు 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024 ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో పోలైన ఓట్లపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సుమారు 62 వేల నుంచి 66 వేల ఓట్లు వచ్చాయని, ఆ సమయంలో వైఎస్సార్సిపికి 92 వేల నుంచి 98 వేల ఓట్లు వచ్చినట్లు తెలిపారు.
Read Also: Anantapur: ప్రేమ వ్యవహారమే యువతీ దారుణ హత్యకు కారణమా..?!
అంతేకాక, 2014తో పోలిస్తే 2019లో ఓట్ల పెరుగుదల కేవలం 200 ఓట్లలో మాత్రమే పరిమితమైందని చెప్పారు. కానీ 2024లో మాత్రం ఓట్ల సంఖ్యలో ఏకంగా 30 వేల ఓట్ల పెరుగుదల చోటు చేసుకున్నట్లు వివరించారు. దీనిపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 95 వేల ఓట్లు, టీడీపీకి 96 వేల ఓట్లు వచ్చినట్లు గణాంకాలను పేర్కొన్న శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ ఓటు బ్యాంక్ స్థిరంగా ఉండగానే, అదనంగా పోలైన 30 వేల ఓట్లు పూర్తిగా టీడీపీకి ఎలా వెళ్లాయో అర్థం కావడంలేదని అన్నారు. అలాగే ఇది సాధ్యమేనా? అంటూ ప్రశ్నించారు.
Read Also: French Open 2025 Winner: మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్..!
ఓట్ల పెరుగుదల ఈ విధంగా ఒక్కపక్షాన జరిగిందంటే ఇందులో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో రాయచోటి నియోజకవర్గంలో రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి.
2024లో అధికంగా పోలైన 30వేల ఓట్లుకూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతోంది. అధికంగా పోలైన ఈ 30వేల ఓట్లు ఒకే పార్టీకి ఎలా పడతాయి? ఇది సాధ్యమేనా? ఇది నమ్మశక్యమేనా
— Gadikota Srikanth Reddy (@GSrikanthYSRCP) June 8, 2025