Pulivendula: కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి ఇవాళ (ఆగస్టు 10న) సాయంత్రం 5గంటలకు తెర పడనుంది. ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 12న) నాటి పోలింగ్‌కు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. అలాగే, పులివెందులలో పురపాలక సంఘంలో కలిసిపోయిన గ్రామాలు మినహా మిగిలిన ఐదు ఎంపీటీసీ స్థానాల పరిధిలో బై ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు.
Read Also: Congress: నేడు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ.. కొండా మురళి, రాజగోపాల్ రెడ్డిపై చర్యలు..?
ఇక, ఒంటిమిట్టలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 24,606 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. బ్యాలెట్ విధానంలో జరిగే ఈ పోలింగ్‌పై పీవోలకు కడపలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం శిక్షణ ఇచ్చారు. బ్యాలెట్ బాక్స్‌లు, పత్రాల వినియోగం, పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
Read Also: Spirit : స్పిరిట్‌లో విలన్ కన్ఫర్మ్.. మొత్తానికి క్లూ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. !
అయితే, గత 30 ఏళ్లుగా పులివెందులలో జెడ్పీటీసీ స్థానాలకి (2001) ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ 1995, 2006, 2013, 2021లో ఏకగ్రీవ ఎన్నికలు కొనసాగాయి. ఇక, తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలతో 30 ఏళ్ల ఏకగ్రీవలకు బ్రేక్ పడినట్లే అని చెప్పాలి. ఈ సారి పోటీలో వైసీపీతో పాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో తమ అభ్యర్థులను పోటీలో పెట్టాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో టీడీపీ- వైసీపీ మధ్య పోటీ ఉంది.. ఊరూరా వెళ్లి తమను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అవసరమైన సంక్షేమ, అభివృద్ధి పనులు చేస్తామని పేర్కొంటున్నారు. మరోవైపు, పులివెందులలో టీడీపీ, వైసీపీ పోటా పోటీ ప్రచారాలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.