వరిధాన్యం, బియ్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వరిధాన్యం కొనుగోలుపై లోకసభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇచ్చారు. 2018-19 లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించగా, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం,…
కృష్ణా,గోదావరి నదీ బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశముందని కేఆర్ఎంబి బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉండటంతో ప్రస్తుతానికి వీలు కాదని తెలిపింది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా సమగ్రంగా ముసాయిదా…
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినబాట పట్టారు.. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు.. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, రేపు రాజధానికి చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎల్లుండి కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని సమస్యలు చాలా ఉన్నాయి.. కృష్ణా నది జలాల విషయం జల జగడం రోజు రోజుకీ రెండు రాష్ట్రాల…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఏపీపై తెలంగాణ… తెలంగాణపై ఏపీ.. ఇలా ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడంలేదు.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.. సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలంటూ కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతితో…
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయ్. తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీ సీఎం జగన్‌కు మహిళలు రాఖీలు కట్టారు. రాజకీయ నేతలకు మహిళా నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ నివాసంలో రాఖీ వేడుకలు జరిగాయి. కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి..శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్. అటు…విజయవాడలో రాఖీ వేడుకలు జరిగాయి. సీఎం జగన్‌కు పలువురు మహిళలు రాఖీలు కట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
తిరుపతి : ప్రస్తుతం జన ఆశీర్వాద యాత్రలో బిజీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదం పై సామరస్యంగా పరిష్కరిస్తామని… అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలని కోరారు. రెండు రాష్ట్ర సమస్యల పరిష్కారానికి జగన్, కేసిఆర్ లతో మాట్లాడుతానని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా టూరిజం రంగం తీవ్రంగా నష్టపోయిందని..టూరిజం రంగానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తామని తెలిపారు.టూరిజం రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని.. దేఖో అప్ కా…
కరోనాతో గత రెండేళ్లుగా శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ నెలలో చాలా జంటలు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. అలాగే అక్టోబర్, నవంబర్‌ల్లోనూ మంచి ముహూర్తాలున్నాయని అంటున్నారు పురోహితులు. ఈనెలలో అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో అన్ని రంగాల వారికి చేతినిండా పని దొరుకుతుంది. ఫ్లవర్ డెకరేషన్, బాజా భజంత్రీలు, వంట మాస్టర్స్‌తో పాటు ఫొటో, వీడియోగ్రాఫర్స్, పురోహితులకు మంచి డిమాండ్ ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కళ్యాణ మండపాలు, కన్వెన్షన్…
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్‌లో ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ఆదేశించింది ఎన్‌హెచ్‌ఆర్సీ. దీంతో ప్రభుత్వాల నుంచి స్పందన లేక పోవడంతో సీరీయస్ అయ్యింది. ఆత్యహత్యలకు సంబంధించి ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. లేకపోతే తమ ముందు హాజరు కావాలని హెచ్చరించింది ఎన్‌హెచ్‌ఆర్సీ.
కేఆర్ఎంబి అధికారుల వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదం అయ్యింది. ప్రాజెక్టుల పనుల పరిశీలన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై తెలంగాణ ఇరిగేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల తర్వాత చాలా ఆలస్యంగా కేఆర్‌ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కేఆర్ఎంబి చైర్మన్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. తాము ఫిర్యాదు దారులమైనందున తమ ప్రతినిధులను కూడా బృందం…
భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 4,41,914 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 4,62,882 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులుగా ఉంది. Read: బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు… పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 208.7210 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ, కుడి గట్టు…