భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 4,41,914 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 4,62,882 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులుగా ఉంది.
Read: బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు…
పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 208.7210 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ, కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అయితే ఈ వరద మరింత పెరగనునట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు సంబంధించిన 14 గేట్లు నిన్న ఎత్తిన విషయం తెలిసిందే.