తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో… ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండల్లా మారడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి లక్షా 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 7టీఎంసీల నీరు నిల్వ ఉంది. 16గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 69వేల…
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు రుతుపవనాలు చురుగ్గా సాగుతుండటంతో జోరుగా వానలు పడుతున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు దంచికొట్టే ఛాన్స్ ఉంది. అలాగే అతిభారీ వర్షాలతో కొన్ని జిల్లాలు అతలాకుతలం అయ్యే అవకాశాలున్నాయని చెప్పింది ఐఎండీ. read also : జులై 13, మంగళవారం దినఫలాలు దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాగాలు సిద్ధంగా…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ ముదురుతోంది.. ఓ వైపు మాటల యుద్ధం.. మరోవైపు ప్రధానికి, కేంద్ర మంత్రులకు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది.. ఇప్పుడు కృష్ణజలాల వివాదంపై సుప్రీంకోర్టుకువెళ్లే యోచనలో ఉంది ఏపీ సర్కార్… సుప్రీంలో పిటిషన్ దాఖలుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంతర్‌రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని, తక్షణమే…
కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం మరోసారి వాయిదా పడింది.. రేపు జరగాల్సిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. తదుపరి సమావేశం తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది కేఆర్‌ఎంబీ.. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదంతో కీలకంగా మారింది కేఆర్ఎంబీ సమావేశం… ఈ విషయంలో ఇప్పటికే కేఆర్‌ఎంబీకి లేఖలు కూడా వెళ్లాయి.. అయితే, కృష్ణా నీటి వినియోగంపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకంటూ ఈ నెల 9న…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కాకరేపుతోన్న జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేవారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల… హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో వివిధ అంశాలపై స్పందించిన ఆమె.. నదీ జలాల విషయంపై వ్యాఖ్యానిస్తూ.. కృష్ణా నది మీద రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే సీఎం కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా? అంటూ ఫైర్ అయ్యారు.. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు.. కలిసి భోజనాలు చేయొచ్చు.. స్వీట్లు తినినిపించుకోవచ్చు… కానీ, రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా?…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం హీట్ పెంచుతోంది… ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో జల వివాదంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్న పవన్.. ఇద్దరు…
తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, కేఆర్‌ఎంబీకి లేఖలు రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.. పదేపదే కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా.. వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ అక్రమంగా వాడేస్తోందని దీనిని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.. ఉమ్మడి…
జల వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దీంతో.. ఇవాళ 6 గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్ననేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో.. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా…
జల జగడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది.. మాటల యుద్ధం, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఎవ్వరు అడ్డుకుంటారో మేం చూస్తాం అని కొందరు అంటుంటే.. మేం అడ్డుకునే తీరుతాం అనే విధంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఇటీవల ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు కాకరేపుతున్నాయి.. అయితే, ఇవాళ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. తెలంగాణ సీఎం కేసీఆర్.. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన…