Tirupati dead bodies: తిరుపతి జిల్లా పాకాల- చంద్రగిరి మూలకోన అటవీ ప్రాంతంలో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన పోలీసులు.. అవి హత్యలా లేక ఆత్మహత్యలా అన్నది తేల్చని పరిస్థితి ఉంది. అయితే మృతులకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన సెల్వన్, జయమాలిని అన్నా చెల్లెలుగా పోలీసులు గుర్తించారు. అంతే కాదు పెద్ద ఎత్తున ఫైనాన్స్ వ్యాపారం చేసినట్టు చెబుతున్నారు. ఆ కోణంలోనూ పోలీసులు…
Peddapuram: పెద్దాపురం పేరు మళ్లీ రిపేరుకొచ్చింది. గతంలో ఎంతో కష్టపడి.. గలీజ్ దందాకు చెక్ పెడితే.. కొంత మంది మళ్లీ వచ్చి పెద్దాపురం ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అండదండలతోనే ఈ దందా మళ్లీ చిగురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ కాలక్రమంలో పెద్దాపురం మారింది. తనపై ముద్ర పడిన 'రెడ్ లైట్' ఏరియా పేరును చెరిపేసుకుంది.
ఒకప్పుడు భర్తల వేధింపులు భరించలేక భార్యలు ఆత్మహత్యలకు పాల్పడేవారు. తర్వాత కట్నం వేదింపులకు మహిళలు బలయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భార్య వేదింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంత మంది భర్తలు. సరిగ్గా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు బ్రహ్మయ్య, కౌసల్య. వీరిద్దరూ భార్యాభర్తలు. కాపురానికి వచ్చిన మొదటి మూడు నెలలు అంతా బాగానే ఉంది. తర్వాత అత్తతో కౌసల్యకు విభేదాలు మొదలయ్యాయి. అది కాస్తా ముదిరింది.…
కుటీర పరిశ్రమలా మద్యం తయారీ. యస్.. మీరు విన్నది కరెక్టే. కోనసీమ జిల్లాలో ఇలాగే కొంత మంది ఇంట్లోనే మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి అన్‌బ్రాండెడ్ లిక్కర్ తయారు చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేశారు. కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్ ఉంటే చాలు.. ఇంట్లోనే మద్యం తయారు చేయవచ్చు.