కుటీర పరిశ్రమలా మద్యం తయారీ. యస్.. మీరు విన్నది కరెక్టే. కోనసీమ జిల్లాలో ఇలాగే కొంత మంది ఇంట్లోనే మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి అన్‌బ్రాండెడ్ లిక్కర్ తయారు చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేశారు. కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్ ఉంటే చాలు.. ఇంట్లోనే మద్యం తయారు చేయవచ్చు. ఈ విషయంపై పరిశోధన చేసిన కొంత మంది గ్యాంగ్.. కుటీర పరిశ్రమ కూడా పెట్టుకున్నారు. ఏకంగా ఓ చిన్న బిల్డింగ్ అద్దెకు తీసుకుని సొంతంగా డిస్టిల్లరీ ఓపెన్ చేశారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పోలీసుల చెవిన పడింది. ఇంకేముంది పోలీసులు రైడ్ చేశారు.
READ MORE: Hyderabad: ఓయో రూంలో యువతి మృతదేహం.. ఇది హత్యా.. ఆత్మహత్యా..?
ఇక్కడ చూడండి.. ఈ మెటీరియల్ అంతా పోలీసులు రైడ్ చేసి తీసుకు వచ్చిన నకిలీ మద్యం తయారీ ముఠాకు సంబంధించినదే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్నంలో తిరుమనాథం దుర్గారావు.. ఓ ఇంటిలో నకిలీ మద్యం తయారీ కేంద్రం స్టార్ట్ చేశాడు. ఇతని ఆధ్వర్యంలోని ముఠా హైద్రాబాద్ నుంచి స్పిరిట్, కేరమిల్ కలర్ ఏజెంట్‌ను కొరియర్ ద్వారా తెప్పించింది.. ఇంకేముంది హైదరాబాద్ నుంచి మెటీరియల్ రాగానే.. ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించారు. 180ML బాటిల్స్‌లో నకిలీ మద్యం నింపి అమ్ముతున్నారు. నిజానికి ప్రభుత్వం నుంచి 180 ఎంఎల్ బాటిల్ రూ. 160కి విక్రయిస్తుండగా.. అదే పేరుతో చేసిన నకిలీ బ్రాండ్‌ను వీళ్లు రూ. 80 నుంచి రూ. 120 వరకు అమ్ముతున్నారు. దీని రేటు తక్కువగా ఉండడంతో జనం ఇదే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
READ MORE: Real Estate Scam: సొంతిటి కలలు కనే వారే టార్గెట్.. రియల్ ఎస్టేట్‌లో కొత్త తరహా మోసాలు..
కొమరిగిరిపట్నంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పోలీసులు సోదాలు చేశారు. అప్పుడు 1065 లీటర్ల స్పిరిట్, 6 వేల ఖాళీ సీసాలను, 6 వేల ఫేక్ లేబుల్స్, 6 వేల మూతలు స్వాధీనం చేసుకున్నారు. అంతే నకిలీ మద్యం తయారీకి ఉపయోగించిన మిషన్‌ను, ఒక ఆటోను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇక్కడ పట్టుకున్న నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాలకొల్లులోని ఒక గోడౌన్‌లో ఉన్న 130 లీటర్ల స్పిరిట్ , కేరమిల్ , మిషన్ , మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు . పాలకొల్లులో వడ్డీ వ్యాపారి పులి రోషన్ శీతల్ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కేసుల్లో ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు..