Peddapuram: పెద్దాపురంలో మళ్లీ వ్యభిచార దందా.. పోలీసులే సహకరిస్తున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddapuram: పెద్దాపురం పేరు మళ్లీ రిపేరుకొచ్చింది. గతంలో ఎంతో కష్టపడి.. గలీజ్ దందాకు చెక్ పెడితే.. కొంత మంది మళ్లీ వచ్చి పెద్దాపురం ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అండదండలతోనే ఈ దందా మళ్లీ చిగురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ కాలక్రమంలో పెద్దాపురం మారింది. తనపై ముద్ర పడిన ‘రెడ్ లైట్’ ఏరియా పేరును చెరిపేసుకుంది. పెద్దాపురంలో అంతకు ముందు ఉన్న గలీజ్ దందాలు.. వాటిని నడిపిన యాజమాన్యాలు.. కంపెనీలు.. అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.. అంతా బాగుంది అనుకున్న సమయంలో.. ఇప్పుడు పెద్దాపురంలో ఆ.. దందా మళ్లీ మొదలైంది. బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరో మహేష్ బాబు.. ముంబైలో మళ్లీ మాఫియాను కళకళలాడేలా చేస్తానని చెప్పినట్టే.. కొంత మంది మహిళలు వ్యభిచార దందాను మళ్లీ కళకళలాడించే ప్రయత్నం షురూ చేశారు. ఇప్పుడు పెద్దాపురంలో రెండు వ్యభిచార గృహాలు నడుస్తున్నాయి. విటుల రేంజ్‌ను బట్టి అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు పెద్దాపురం ఉన్న రేంజ్‌కు మళ్లీ ప్రాస్టిట్యూషన్ దందాను తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇతర ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకు వచ్చి మళ్లీ దందాను యథావిధిగా నడిపిస్తున్నారు. ఎవరైనా అమ్మాయిలను నయానో భయానో భయపెడుతున్నారు. బలవంతంగా రొంపిలోకి దింపుతున్నారు.. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు భారతి. ఈమె మమూలు లేడీ కాదు కిలాడీ లేడీ. పెద్దాపురంలో మళ్లీ రెడ్ లైట్ దందాకు ఆజ్యం పోసింది. కొంత మంది యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది. కస్టమర్స్‌కు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆకర్షిస్తోంది. ఈమెకు కొంత మంది స్థానిక పోలీసులు కూడా అండగా ఉన్నారు. దీంతో మరింత రెచ్చిపోతోంది. ఇప్పుడు పెద్దాపురంలో గుట్టుగా సాగుతున్న ఈ గలీజ్ దందా ఓ మహిళ ద్వారా వెలుగులోకి వచ్చింది. తనను బ్లాక్‌మెయిల్ చేసి బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దింపారని చెబుతోంది ఆ మహిళ.
READ MORE: Nigerian Drug Mafia: హైదరాబాద్‌లో 2500 మంది నైజీరియన్‌లు.. ఏ డ్రగ్ కేసు చూసినా వీళ్లే..!
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
తన కూతురును బంధించి.. తనతో వ్యభిచారం చేయించారని గోడు వెళ్లబోసుకుంది. ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో.. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గలీజ్ దందా చేస్తున్న భారతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సహకరిస్తున్న కానిస్టేబుల్ శివరామకృష్ణ, హోంగార్డ్ శివకృష్ణను సస్పెండ్ చేశారు. వారిద్దరిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు పెద్దాపురం ఎస్ఐ మౌనిక. అంతే కాదు పెద్దాపురంలో రెడ్ లైట్ ఏరియాలను తలపిస్తున్న వీధుల్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు.. మరోవైపు వ్యభిచార గృహాల నిర్వాహకులలో కూడా ఆధిపత్య పోరు నడుస్తోందంటున్నారు పోలీసులు. మొత్తంగా అన్ని కంపెనీలను కూకటివేళ్లతో సహా పీకేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామంటున్నారు. మొత్తానికి పెద్దాపురంలో మళ్లీ వ్యభిచార దందా షురూ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రతి నెలా పోలీసులకు మామూళ్లు వెళ్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఫలితంగా పోలీసుల్లో కొంత మందే ఈ దందాకు సహకరించి ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
READ MORE: Health Tips: ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. ఇదొక్కటి డైట్ లో చేర్చుకోండి!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?