ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి.
అనంతపురం టీడీపీలో నేతల స్టైలే వేరు. రాజకీయ ప్రత్యర్థులను వదిలేసి.. తమలో తామే పాలిటిక్స్‌ను రక్తికట్టిస్తారు. ఈ జాబితాలో టాప్‌లో ఉంటున్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనకు సంబంధం లేకుండా పుట్టపర్తిలో ఎలా పర్యటిస్తారని జేసీని పల్లె ప్రశ్నిస్తుంటే.. కార్యకర్తలలో భరోసా నింపడానికే వెళ్లానని బదులిస్తున్నారు ప్రభాకర్‌రెడ్డి. ఒక ప్రైవేటు స్థలంపై సాగుతున్న వివాదం.. అనంత టీడీపీలో కలకలం రేపుతోంది. అక్రమాలు నిగ్గు…
బాహుబలి సైన్యంలా వెళ్లారు. తీరా యుద్ధంలో చతికిల పడ్డారు. 20వార్డులకు రెండుచోట్లే గెలిచారు. ఈ ఫలితాలతో ఆ జిల్లా నేతలకు అధినేత నుంచి అక్షింతలు పడ్డాయట. డైలాగ్ కొంచెం తేడా కావొచ్చేమో కానీ.. తమ్ముళ్లకు సీరియస్‌గానే తలంటారట. టీడీపీలో చర్చగా మారిన ఆ పోస్టుమార్టం ఏంటి? లెట్స్ వాచ్..! పెనుకొండ పురపోరులో పాతికమంది టీడీపీ నేతల ప్రచారం..! రాష్ట్రంలో ఇటీవల జరిగిన మినీ మున్సిపల్ పోరు పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది. కుప్పం తరువాత అంత హైప్…
టీ కొట్లు.. రచ్చబండల మీద జరిగే చర్చలు యమ రంజుగా ఉంటాయి. రాజకీయాలపై చాలా ఆసక్తిగా చర్చలు అక్కడ జరుగుతుంటాయి. ఒక మాజీ మంత్రిపై ఆ నియోజకవర్గంలో అలాంటి చర్చే నడుస్తోందట. చర్చకు కారణం ఆయనపై వచ్చిన ఒక కరపత్రం. ఆ కరపత్రాల టాక్స్ టీకొట్ల వరకు ఆగితే ఓకే.. పార్టీ అధినేత వరకు వెళ్తే ఏంటన్నదే ప్రశ్నగా మారింది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..! కాల్వ చుట్టూ టీడీపీలో విమర్శలు..! గతంలో అనంతపురం జిల్లా టీడీపీలో…
ఆ జిల్లా టీడీపీలో ఎప్పుడు ఏ గొడవ జరిగినా.. అధిష్ఠానం పేరుతో ఒక లెటర్ వస్తుంది. అందులో ఊరు పేరు.. మ్యాటర్ ఉంటుంది. ఎందుకు పంపిస్తున్నారు.. ఎవరికి పంపిస్తున్నారో వివరాలు కనిపించవు. కానీ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇంతకీ ఆ లేఖల ఆంతర్యం ఏంటి? ఇప్పటికే అనంతలో జేసీ వర్సెస్ టీడీపీ పాత నేతలు..! అనంతపురం జిల్లా టీడీపీలో కొన్నిరోజులుగా వర్గ విబేధాలు ఒక రేంజ్‌లో సాగుతున్నాయి. గతంలో నియోజకవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉండేది.…
పార్టీ అధికారంలో లేకపోయినా కయ్యానికి కాలు దువ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదట తెలుగు తమ్ముళ్లు. పార్టీ పెద్దల దగ్గర ‘రాజీ’ పడుతున్నట్టు చెబుతున్నా.. బయటకొచ్చాక కుస్తీలే. దీంతో టీడీపీ అధిష్ఠానం కూడా ఆ నియోజకవర్గాలను వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీ పెద్దలకు మింగుడు పడని వర్గపోరు! ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోటల్లో అనంతపురం జిల్లా కూడా ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ రెండుచోట్లే గెలిచింది. మిగతాచోట్ల…