Gorantla Madhav : ఎంపీ గోరంట్ల మాధవ్ ఏపీతోపాటు ఢిల్లీలో కూడా రచ్చ చేస్తుంటే.. అనంత జిల్లా నేతలు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు? వైసీపీ నేతలంటే తమ పార్టీ నేత కాబట్టి సైలెంట్ గా ఉండటంలో అర్థం, పర్థం వుంది. కానీ అనంత టీడీపీ నేతలు సైతం ఎందుకు మౌనంలో మునిగి తేలుతున్నారు? సైలెన్స్ వెనక అసలు కథ వేరే వుందా?
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ఇష్యూలో, టీడీపీ నేతలు వైసీపీని నేరుగా టార్గెట్ చేసి విమర్శలు దాడి చేస్తున్నారు. ఇంతా జరుగుతుంటే అనంతపురం జిల్లా టీడీపీ నేతలు మాత్రం మౌనంగా ఉంటున్నారు. వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే తమ పార్టీ నేత గురించి ఎందుకు మాట్లాడటం అనుకొని ఉండొచ్చు. అందునా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారు. కానీ టీడీపీ నేతల మౌనం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అంటూ కొందరు పేరాలకు పేరాలు ఆరా తియ్యడం మొదలెట్టారు..
టీడీపీ అధిష్టానం ఓవైపు మాధవ్ విషయాన్ని క్యాష్ చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే.. జిల్లా నేతలు మాత్రం ఒకరిద్దరు మినహా ఎవరూ స్పందించలేదు. దీనికి కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే.. మాధవ్ కురుబ సామాజక వర్గానికి చెందిన కావడమే. ఎందుకంటే జిల్లాలో కురుబల జనాభా చాలా ఎక్కువగా ఉంది. హిందూపురం పార్లమెంట్ లో అయితే అన్ని నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఎవరైనా మాధవ్ ను కించపరిచేలా మాట్లాడితే కురుబలు మాధవ్ ను ఓన్ చేసుకున్న నేపథ్యంలో, ఓట్ బ్యాంక్ కు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇదే సామాజిక వర్గానికి చెందిన పార్థసారధి మీడియా సమావేశం పెట్టి ఈ ఘటనపై స్పందిస్తున్నారు…విజువల్స్
టీడీపీ నేతల మౌనం వెనుక ఇంకో కోణం కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. మాధవ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలపై నిఘా పెట్టినట్టు సమాచారం. వారు తరచూ బెంగళూరుతో పాటు అటు వైపు ఉన్న ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారు.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు.. ప్రధానంగా రిస్టార్ట్ సెంటర్లు, మసాజ్ సెంటర్లు ఇలాంటి వాటిపై వైసీపీ నేతల నిఘా ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు బళ్లారి, గౌరిబిదునూరు, బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్న నేతల మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత ఉందో కానీ ఇదే అంశంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.
మొత్తం మీద మాధవ్ వ్యవహారం.. కేవలం వైసీపీకి మాత్రమే కాదు.. ఇటు టీడీపీ నేతలకు కూడా తలనొప్పిగా మారింది. స్పందిస్తే ఒక తలనొప్పి.. స్పందించకపోతే ఇంకో తలనొప్పి అన్నట్టుగా మారింది.