ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనందయ్య పిటీషన్ దాఖలు చేశారు. గత 30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్‌గా ఉన్నానని, ఆనందయ్య తన పిటీషన్‌లో పేర్కొన్నారు. సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం కోవిడ్ 19 కి చేస్తున్నామని, మందు తయారీ, పంపిణీ చేయడంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనందయ్య తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, నెల్లూరు కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, డిఎంహెచ్ఓ, ఆయుష్ కమీషనర్‌లను చేర్చారు. ఈ కేసును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అనందయ్య మందు కరోనాకు పనిచేస్తుందనే ప్రచారం జరగడంతో ఒక్కసారిగా జనాలు మెడిసిన్ కోసం కృష్ణపట్నం వచ్చారు. పెద్ద సంఖ్యలో కరోనా రోగులు కూడా అక్కడికి రావడంతో తోపులాట జరిగింది. దీంతోమందు సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం ఆనందయ్య మెడిసిన్‌పై సీసీఆర్ఏఎస్ పరిశోధనలు చేస్తున్నది.