ఆనందయ్య మందు తయారీపై సందిగ్ధం కొనసాగుతోంది. ఆనందయ్య మందు హానికరం కాదని ఇప్పటికే ఆయుష్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుపై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఆయుర్వేద కళాశాలలు మందుపై పరిశోధన ప్రారంభించాయి. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుండి వివరాలను సేకరిస్తున్నారు. పరిశోధన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. పరిశోధనకు సంబందించిన రిపోర్టులు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి మందు తయారీ మరింత ఆలస్యం కావొచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో కృష్ణపట్నానికి కరోనా పేషెంట్‌ల రాక తగ్గిపోయింది. అయితే, కృష్ణపట్నంలో పోలీసుల ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్యకు పోలీసులు భారీ రక్షణ ఏర్పాట్లు చేశారు.